Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వారు గోవర్థన్
నవతెలంగాణ-చౌటుప్పల్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు పాట ఆయుధమని ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు అవ్వారు గోవర్థన్ అన్నారు. సోమవారం మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలో ఆ సంఘం మండలకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గోవర్థన్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజానాట్యమండలి ఆటపాటల ద్వారా ప్రజలను చైతన్యపర్చుతుందన్నారు. ప్రజానాట్యమండలి కార్మిక, స్వాతంత్య్ర ఉద్యమంలో, తెలంగాణ సాయుధ పోరాటంలో తనదైన శైలిలో కళారూపాల ద్వారా ప్రజలను ఉద్యమాల వైపు మళ్లించిందన్నారు. రానున్న రోజుల్లో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కషిచేస్తున్నామని తెలిపారు. ప్రజానాట్యమండలి ద్వారా ప్రజలను ప్రజా ఉద్యమాల వైపు మళ్లిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్షులు గంటిపాక శివకుమార్, సీపీఐ(ఎం) మండలకార్యదర్శి గంగదేవి సైదులు, నాయకులు తడక మోహన్, బోదాసు వెంకటేశం, ఎస్కె.మదార్, ఎం.లింగస్వామి, సుందర్, పల్లె సత్యం పాల్గొన్నారు.