Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత
నవతెలంగాణ -ఆలేరురూరల్
రాష్ట్ర అభివద్ధి కోసం మాట నిలబెట్టుకునే వ్యక్తి సీఎం కేసీఆర్ అని ఆలేరు శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్రెడ్డ్డి అన్నారు.సోమవారం మండలంలోని కందగడ్డ శ్రీనివాసపురం శివ లాల్ తండ గుండ్ల గూడెం కొల్లూరు మందనపల్లి గ్రామాలలో సర్పంచులు కేతావత్ సుజాత, వడ్ల నవ్య శోభన్ బాబు, ఏసి రెడ్డి మహేందర్ రెడ్డి, కోటగిరి జయమ్మ ,కోటగిరి పాండరి ఆధ్వర్యంలో స్పెషల్ డెవలప్ంట్ ఫండ్ ఎస్ డి ఎఫ్ గ్రామ పంచాయతీల రూ.25 లక్షల రూపాయల నిధులతో సీసీి రోడ్లు అండర్ డ్రయినేజీ లు, మల్టీపర్పస్ బిల్డింగులు మినరల్ సబ్ సెంటర్లు వంటి అభివద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికీ లబ్ది చేకూరిందన్నారు. గ్రామాలలో దశలవారీగా చేపడుతున్న అభివద్ధి పథకాలను పూర్తి చేస్తామన్నారు. ఏప్రిల్ నెలలో అర్హులందరికీ పింఛన్లు ఇవ్వడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు .మార్చి నెలలో అర్హులైన వారందరూ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గంగుల శ్రీనివాస్ , పీఏసీఎస్ చైర్మెన్ మల్లేశం, మాజీ వైస్ ఎంపీపీ కిష్టయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు అంజయ్య ,రవి నాయక్ ,విజరు, జనగాం వెంకట పాపిరెడ్డి ,సుంచు మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నర్సింలు ,మాజీ ఎంపీపీ అనసూర్య ,యువజన విభాగం మండల అధ్యక్షుడు కష్ణ, విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు భానుచందర్ ,తదితరులు పాల్గొన్నారు.