Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని మీటింగ్ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుండి 81 ఫిర్యాదులను ఆమె స్వీకరించారు. ఎలాంటి పెండింగ్ లేకుండా ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆర్డిఓ భువనగిరి 8, ఆర్డీవో చౌటుప్పల్ 1, వివిధ తహసీల్దార్లకు సంబంధించి 62, ఆలేరు మున్సిపాలిటీ 2, విద్యా శాఖ 2 జిల్లా గ్రామీణ అభివద్ధి అధికారి 2, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2,జిల్లా మైనింగ్ శాఖ 1, శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం 1 చొప్పున మొత్తం 81 ఫిర్యాదులు స్వీకరించినట్టు తెలిపారు.