Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో చౌటుప్పల్ పట్టణ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం టైలర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం కేక్ కట్చేసి స్వీట్లు పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు కొంగరి కనకయ్య మాట్లాడారు. ప్రభుత్వం టైలర్స్ షాపులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, ఉచిత భీమా సౌకర్యం కల్పించి, హెల్త్ కార్డులు ఇవ్వాలని, వడ్డీలేని రుణాలు మంజూరుచేయాలని, 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇవ్వాలని, ఇళ్లు లేని నిరుపేద టైలర్లకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మార సంగమేశ్వర్, గంగాపురం దశరథ, బడుగు కష్ణ, సోమేశ్, భూమేశ్, పాశం శంకర్, భాస్కర్, బిక్షపతి, శ్రీను పాల్గొన్నారు.