Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధులు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆలేరు మాజీ సర్పంచ్,రాష్ట్ర మాజీ ప్రజాప్రతినిధులు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకావ రామ్మోహన్రావు, ఆ సంఘం అధ్యక్షులు మేడి శంకరయ్యతో కలిసి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ను హైదరాబాద్లోని ఆయన నివాసం వద్ద కలిసి వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సేవ కొరకు కషి చేస్తున్న వారందరికీ బస్ పాసులు ,సంఘానికి హైదరాబాద్ నందు ప్రభుత్వ స్థలం కేటాయింపు, భవన నిర్మాణం కొరకు నిధులు మజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.