Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
అ పశు వైద్యశాల నూతన భవనం ప్రారంభం
నవతెలంగాణ -రామన్నపేట
రామన్నపేట పట్టణంలో డ్రయినేజీ వ్యవస్థను మెరుగు పరుస్తామని, మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలో మైనార్టీకాలనీలో రూ.5లక్షలతో నిర్మించనున్న సీసీి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నూతనంగా నిర్మించిన ప్రాంతీయ పశువైద్యశాల భవనాన్ని ప్రారంభించారు. అంతకుముందు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ పట్టణం వాసులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ప్రణాళికబద్ధంగా పట్టణ అభివద్ధికి కషి చేస్తానని తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని కష్ణవేణి టాలెంట్ స్కూల్లో సోమవారం ఏర్పాటు చేసిన సైన్స్ ఫేర్ ఎక్జిబిషన్ను ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రారంభించారు. అనంతరం టైలర్స్ డే సందర్భంగా రామన్నపేట టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను ఎమ్మెల్యే చిరుమర్తి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి వి కష్ణ, జిల్లా సహాయ సంచాలకులు డాక్టర్ ఐలయ్య, ప్రాంతీయ సహాయ సంచాలకులు డాక్టర్ సంజీవ రావు, స్థానిక ఎంపీపీ కన్నెబోయిన జ్యోతి బలరాం, పీఏసీఎస్ చైర్మెన్ నంద్యాల బిక్షం రెడ్డి, వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, తహసిల్దార్ వలికొండ ఆంజనేయులు, ఎంపీడీవో జలంధర్ రెడ్డి, పశువైద్యాధికారి శ్రీధర్ రెడ్డి, డాక్టర్ శాంతి బాబు, టీిఆర్ఎస్ మండల అధ్యక్షులు మందడి ఉదరు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.