Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఒకరికి తీవ్రగాయాలు..గ్రామస్తుల రాస్తారోకో
నవతెలంగాణ-మోత్కూరు
ఇసుక లారీ ద్విచక్ర వాహనాన్ని ఢకొీట్టడంతో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితున్ని ఆదుకోవాలని, ఇసుక లారీలను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రాస్తారోకో చేశారు. ఈ సంఘటన సోమవారం మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. వలిగొండ మండలం దుప్పెల్లి గ్రామానికి చెందిన మారోజు విష్ణుమూర్తి సోమవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి వెళుతుండగా దత్తప్పగూడెం గ్రామం వద్ద తొర్రూర్-వలిగొండరూట్లో వెళుతున్న ఇసుక లారీ వేగంగా ఎదురుగా వస్తున్న విష్ణుమూర్తి వాహనాన్ని ఢకొీట్టింది. దీంతో విష్ణుమూర్తి కాళ్లకు తీవ్రగాయాలు కావడంతో గ్రామస్తులు అతన్ని చికిత్స కోసం 108 వాహనంలో హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. నిత్యం ఈ రూట్లో పదుల సంఖ్యలో లారీలు వేగంగా వెళుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇసుక లారీలను నియంత్రించాలని, బాధితున్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తులను సముదాయించి ఆందోళన విరమింప జేశారు. ఇసుక లారీపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఎస్ఐ వి.జానకిరాంరెడ్డి తెలిపారు.