Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
రామన్నపేట జూరిడిక్షన్ పరిధిలోనే చిట్యాల మండలాన్ని యథావిధిగా కొనసాగించాలని స్థానిక బార్ అసోసియేషన్ న్యాయవాదులు కోరారు. సోమవారం రామన్నపేట బార్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం వారు మాట్లా డుతూ ఈ నెల 28 నుండి వచ్చే నెల 4 వరకు బహిష్కరణ కొనసాగుతుందని తెలిపారు. రామన్నపేట జూరిడిక్షన్ నుండి చిట్యాల మండ లాన్ని నల్గొండ కోర్టుకు మార్చడం వల్ల ప్రజలు దూరబాధలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కాంపాటి యాదగిరి, జినుకల ప్రభాకర్, అశోక్ కుమార్, బోడిగే లక్ష్మయ్య, కేమా రామదాస్, బర్ల డేవిడ్, నకిరేకంటి మొగులయ్య, ఎంఏ. మజీద్, యాదాసు యాదయ్య, సంగి శెట్టి బాలరాజు, ఏళ్ళ శ్రీశైలం, బి దినేష్ కుమార్, సుక్క శ్రవణ్, బాలరాజు, మామిడి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.