Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -యాదగిరిగుట్ట
మండల పరిధిలోని కాచారం,ధర్మారెడ్డి గూడెం గ్రామాల్లో ఎస్సీ కార్పొరేషన్ కింద దళితులకు ఇచ్చిన భూములను దళారులు ఆక్రమించుకున్నారని భూములను తమకు తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ గ్రామ దళితులు సోమవారం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత మహిళలు మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ కింద తమకు కేటాయించిన భూములకు ఏన్ఓసీ ఇస్తామని నమ్మించి వేలిముద్రలు తీసుకుని ఏజీపీ చేసుకున్నారని వారిపై చర్యలు తీసుకొని తమ భూములు తమకే వచ్చే విధంగా చూడాలన్నారు.ఈ విషయంపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ కు దరఖాస్తు చేసినా స్పందించలేదని ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో బిబినగరం లక్ష్మి వంగపల్లి రేణుక,పద్మ, మేకల మల్లమ్మ ,గూడూరు లక్ష్మి, సుంచు మల్లయ్య ,తదితరులు ఉన్నారు.