Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్‌నగర్‌టౌన్
సీఎం కేసీఆర్ భారతరాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారని టీపీసీసీ మాజీ అధ్యక్షులు, నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.తాను ఆరు న్నరేండ్ల పాటు రాష్ట్రపతి వద్ద పని చేశానని, దేశ బడ్జెట్ ప్రవేశపెట్టిన నప్పుడు ఉభయసభల్లో రాష్ట్రపతి వచ్చి ప్రసంగం చేస్తారన్నారు. అదేవిధంగా శాసనసభలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో అన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు.అయితే ఉభయ సభల్లో ఏనాడు కూడా రాష్ట్రపతి, గవర్నర్లకు రాజకీయ సంబంధాలు లేకుండా పిలివాలి కానీ ఇక్కడ కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ గవర్నర్‌ను పిలవకుండా బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారని ఆరోపించారు.ఇది ముమ్మాటికీ రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని ఆందోళన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ జ్యుడీషియల్‌ను కూడా అవమానపరిచేలా సీఎం కేసీఆర్ అవహేళన చేసి మాట్లాడుతున్నారన్నారు.కోర్టు ధిక్కరణ కేసులున్న కలెక్టర్‌ను ఎమ్మెల్సీ చేసి ఇష్టారీతిగా పాలన చేస్తున్నారని విమర్శించారు.హుజూర్నగర్ మున్సిపాల్టీలో అవినీతి జరుగుతోందని రూ.100 ల కోట్ల విలువైన మున్సిపాల్టీ లేఅవుట్ భూములకు ఫీనిషింగ్ వేయడం లేదనానరు.బ్లీచింగ్ ఫౌడర్ కొనుగోలు నుండి పెట్రోల్ బంక్‌ల అనుమతులు, లేఅవుట్లలో అవినీతి వెనుక ఉన్న గాడ్ పాదర్ ఎవరని ప్రశ్నించారు.అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించకోవడం లేదన్నారు. హుజూర్నగర్ మున్సిపాల్టీలో జరుగుతున్న అవినీతిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.ఈ సమావేశంలో కాంగ్రెస్ మైనార్టీ సెల్ జిల్లా చైర్మెన్ ఎండి.నిజాముద్దీన్, నాయకులు కోతి సంపత్‌రెడ్డి, కస్తాల శ్రావణ్‌కుమార్, వీరారెడ్డి, నందిగామ శ్రీనివాస్ పాల్గొన్నారు.