Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్కెట్ చైర్మెన్‌్ యాకుబ్ రెడ్డి
నవ తెలంగాణ-మోత్కూరు
రైతులు నాణ్యమైన కందులు మార్కెట్‌కు తెచ్చి మద్దతు ధరకు అమ్ముకోవాలని మోత్కూరు మార్కెట్ చైర్మెన్ కొణతం యాకూబ్ రెడ్డి కోరారు. మోత్కూరు మార్కెట్లో సింగిల్‌విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రంలో బుధవారం ఆయన కందుల కొనుగోలును పరిశీలించి మాట్లాడారు. రైతులు ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని నష్టపోకుండా రైతులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.6300 మద్దతు ధరఇస్తుందని, కేంద్రానికి రైతులు తెచ్చిన సరుకును సకాలంలో కొనుగోలు చేసి డబ్బులు చెల్లిస్తున్నట్టు చెప్పారు. కందుల రాశులపై కప్పడానికి టార్పాలిన్లు ఇస్తున్నామన్నారు. ఆయన వెంట సింగిల్ విండో డైరెక్టర్ పురుగుల మల్లయ్య ఉన్నారు.