Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డబ్బును పాలకులు అధికార పీఠాన్ని అధిరోహించడానికి ఉపయోగించుకుంటున్నారు
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్
నవతెలంగాణ-చౌటుప్పల్
నేటి సమాజంలో డబ్బు మానవ విలువలతోపాటు రాజకీయ సిద్ధాంతాలను నిర్వీర్యం చేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.అబ్బాస్ తెలిపారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని కందాల రంగారెడ్డి స్మారక భవనంలోని తిరందాసు గోపి అధ్యయన వేదిక ఆధ్వర్యంలో డబ్బు ఆర్థిక శక్తే కాదు అణచివేత సాధనం కూడా అనే స్టడీసర్కిల్ కార్యక్రమాన్ని అవ్వారు గోవర్థన్, తడక మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ స్టడీ సర్కిల్‌కు అబ్బాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డబ్బు అనేది మానవ సమాజంలో మొట్టమొదటగా వస్తు మార్పిడికి ఉపయోగించారని తెలిపారు. నేటి ఆధునిక సమాజంలో డబ్బు లేకపోతే మనిషి బతకలేని స్థితికి వచ్చాడన్నారు. నేటి పాలకులు రాజకీయాలను పెద్ద వ్యాపారంగా మార్చారని పేర్కొన్నారు. డబ్బును పాలకవర్గాలు అధికార పీఠాన్ని అధిరోహించడానికి ఉపయోగించుకుంటున్నాయని తెలిపారు. ప్రజలను అణచివేతకు సాధనంగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు. శాస్త్రీయ హేతుబద్ధ ఆలోచనలు రాకుండా ప్రజలను మత మౌడ్యంలో ఉంచాలని మతోన్మాద శక్తులు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు. రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను మతం, సంప్రదాయాల పేరుతో బలవంతంగా అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నాయన్నారు. మత రాజ్య స్థాపన దిశగా బీజేపీ వెళ్తుందని విమర్శించారు. ఒక వైపు దేశ సంపద ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ మరోవైపు దేశభక్తి, దైవభక్తి పేరుతో ప్రజలను బీజేపీ ప్రభుత్వం మభ్యపెడుతుందని విమర్శించారు. మతోన్మాద శక్తులను ఎదురించడానికి ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దోనూరి నర్సిరెడ్డి, జిల్లాకమిటీ సభ్యులు బూర్గు కష్ణారెడ్డి, ఎమ్‌డి.పాషా, గంగదేవి సైదులు, బండారు నర్సింహా, నాయకులు దోడ యాదిరెడ్డి, ప్రసాదం విష్ణు, రాగీరు కిష్టయ్య, గోశిక కరుణాకర్, దోనూరి బుచ్చిరెడ్డి, చీరిక సంజీవరెడ్డి, అంతటి అశోక్, మంచాల మధు, బొడ్డు రాజు, బోయ యాదయ్య, భావండ్లపల్లి స్వామి, పంతంగి సోమరాజు, బొడ్డు అంజిరెడ్డి, గుర్రం నర్సింహా, ఎమ్‌డి.పాషాబాయి, నెల్లికంటి నర్సింహా పాల్గొన్నారు.