Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో నికష్ట విధానాలను బీజేపీ అమలు
- శాసన మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ
గుత్తా సుఖేందర్ రెడ్డి
నవతెలంగాణ -నల్లగొండ
గవర్నర్ వ్యవస్థను కాంగ్రెస్, బీజేపీలు నిర్వీర్యం చేశాయని శాసన మండలి మాజీ చైర్మెన్, ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శాసనసభ సమావేశాలకు గవర్నర్‌ను పిలవాలని బీజేపీ రాద్ధాంతం చేస్తుందని మండిపడ్డారు. శాసనసభ ప్రొరోగ్ గురించి తెలుసుకుని నాయకులు మాట్లాడాలని హితవు పలికారు. ప్రశాంత్ కిషోర్ దేశవ్యాప్తంగా రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించారన్నారు. గతంలో పలు సందర్భాల్లో ఉమ్మడి శాసనసభకు గవర్నర్‌ను పిలువకుండానే సమావేశాలు నిర్వహించారని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కులనే రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని పేర్కొన్నారు. గవర్నర్ పాత్రను బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయ పరిమితం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ ,బీజేపీకి లేదన్నారు. రాష్ట్రంలో సుభిక్షమైన, సుస్థిర పరిపాలన కొనసాగితుందని బీజేపీ కుటిల యత్నాలు తిప్పికొడతామని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు అవగాహన లేమితో మాట్లాడుతున్నారని ఇటీవల జరిగిన తమిళనాడులో బీజేపీకి ఘోర పరాభవం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో నికృష్ట విధానాలు బీజేపీ అమలు చేస్తుందని మండిపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో కేంద్రం ముందస్తు ఆలోచన లేదని యూపీ లో అధికార దాహం తప్ప బీజేపీకి వేరే ఆలోచన లేదన్నారు. ఉభయ జాతీయ పార్టీలు దేశ అభివృద్ధిపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పార్టీ పరంగా ఎవరి సేవలు ఉపయోగించుకోవలనేది టీఆర్ఎస్ వ్యక్తిగతమన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మెన్ బండ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.