Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభివద్ధికి కషి
- బడుగుల లింగయ్య యాదవ్, రాజ్యసభ సభ్యులు
- ఘనంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య 62వ జన్మదిన వేడుకలు
నవతెలంగాణ- చౌటుప్పల్రూరల్
వత్తి ధర్మాన్ని పాటిస్తూ, పార్లమెంటు సభ్యుడిగా ప్రజల కోసం పనిచేస్తూ భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ అభివద్ధి ప్రదాత బూర నర్సయ్య పేరు సంపాదించారని రాజ్యసభ సభ్యులు, టీిఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ముందువరుసలో ఉన్నారని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని ఎస్ఎంఆర్ ఫంక్షన్ హాల్లో మాజీ ఎంపీ బూర నర్సయ్య 62 వ పుట్టినరోజు వేడుకలు టీిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేశారు. పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించారు. రక్తదానం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ బూర నర్సయ్య ఎంపీగా ఉన్నప్పుడు నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను కలుపుకొని గ్రామాల అభివద్ధికి కషి చేశారన్నారు. బలహీన వర్గాలలో పుట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజల హదయాలలో స్థానం సంపాదించారన్నారు. నిగర్విగా ఉంటూ అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కేసీఆర్ అడుగుజాడల్లో పనిచేస్తున్నారని కితాబిచ్చారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గం ఇన్చార్జి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ బూర నర్సయ్య పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేశారని అన్నారు. బూర నర్సయ్య 62వ జన్మదినం సందర్భంగా బీఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 64 టీమ్లు పాల్గొన్నాయని తెలిపారు. టోర్నమెంట్లో ప్రథమ బహుమతి గెలుపొందిన వారికి, ద్వితీయ బహుమతి పొందిన వారికి బహుమతుల ప్రధానోత్సవం చేశారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మెన్ వెన్ రెడ్డి రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ కర్నే ప్రభాకర్, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మెన్ బండా నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం,చౌటుప్పల్ ఎంపీపీ తాడూరు వెంకట్ రెడ్డి, నారాయణపురం ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జెడ్పీటీసీలు నారబోయిన స్వరూప రవి,కర్నాటి వెంకటేష్,భానుమతి వెంకటేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్విండో చైర్మెన్ చింతల దామోదర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీి పెద్దిటి బుచ్చిరెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు సికిలమెట్ల శ్రీహరి,మండల అధ్యక్షులు మునుగాల ప్రభాకర్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్,కత్తుల లక్ష్మయ్య, మున్సిపల్ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
రైతులకు మద్దతు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
నవతెలంగాణ- మునుగోడు
రైతు ఆరుగాలం కష్టించి పండించిన పంటకు మద్దతు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ శ్రీశైలం ఆవేదన వ్యక్తం చేశారు బుధవారం మండలంలోని కల్వకుంట్ల పలివెల మునుగోడు గ్రామాలలో రైతుల అభిప్రాయ సేకరణ చేపట్టిన అనంతరం మండల కేంద్రంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వాలే రైతులకు సబ్సిడీపై ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు, వ్యవసాయ పరికరాలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఒకే విడత రుణమాఫీ చేసి తిరిగి పంట రుణాలను మంజూరు చేయాలని కోరారు .ఈనెల 5 ,6 సూర్యాపేట జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ సదస్సు కు రైతులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల కార్యదర్శి చాపల మారయ్య , మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న , నారబోయిన నరసింహ , పగిళ్ల బిక్షమయ్య , యసరాని శ్రీను , మిర్యాల భరత్ , పూల శీను , రాములు , హనుమయ్య , సైదులు తదితరులు పాల్గొన్నారు.