Authorization
Sat March 22, 2025 07:48:52 am
- దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-దామరచర్ల
దామరచర్ల, అడవిదేవులపల్లి మండలాలపరిధిలోని వీర్లపాలెం, ముదిమాణిక్యం గ్రామాల రెవెన్యూశివారులో ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా అక్రమంగా ఏర్పాటు చేస్తున్న సెంథని ఫ్యాక్టరీ యాజమాన్యం దిష్టిబొమ్మను బీసీ సంక్షేమ సంఘం, మాల మహానాడు అధ్వర్యంలో బుధవారం మండలకేంద్రంలోని హైవేపై దహనం చేశారు.ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్యయాదవ్, మాల మహానాడు విద్యార్ది సంఘం రాష్ట్ర కార్యదర్శి తాళ్లపల్లి సురేష్ మాట్లాడారు.స్థానిక ప్రజలకు అసలు ఏం కంపెనీ పెడుతున్నారో చెప్పకుండా, కనీసం ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసం ప్రశ్నించారు. ఇదే సెంథని ఫ్యాక్టరీ యాజమాన్యం కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసినపుడు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని, స్థానికులకు ఉద్యోగ అవకాశాలుంటాయని చెప్పి అక్కడి ప్రజలను మోసగిం చారన్నారు.దీంతో ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాల వల్ల నాశన మవుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆరోపించారు.అదేవిధంగా పవర్ప్లాంట్తో ఇప్పటికే అనేక సమస్యలను మండల ప్రజలు ఎదుర్కొంటుంటే మరోవైపు ఇథనాల్ తయారీ చేసే ప్లాంట్ ఏర్పాటు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రజల అభిప్రాయానికి అనుకూలంగానే ప్లాంట్ ఏర్పాటు చేయాలని, లేనిపక్షంలో ప్లాంట్ ఏర్పాటు చేయకుండా ప్రజలే తరిమికొడ్తారని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి దుండిగల వెంకటేశ్వర్లుగౌడ్,బీసీయువజనసంఘం డివిజన్ జనరల్ సెక్రెటరీ కనకం శ్రీను నాయుడు, శంకర్, శ్రీకాంత్, మహేష్, హనుమంతు, పవన్, కోటేష్, నరేష్, సాయి, వాలు, సంతోష్, లోకేష్, అశోక్, సిద్ధు పాల్గొన్నారు.