Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
మండలంలో రాబోయే వేసవి కాలంలో నీటిఎద్దడి నివారణకు ప్రత్యేకచర్యలు తీసు కోవాలని ఎంపీపీ భూక్యాగోపాల్నాయక్ మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథపై డీఈలు,ఏఈలు, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.మండలం ఎక్కువగా మెట్ట ప్రాంతాల్లో ఉండడంతో మారుమూలప్రాంతాల్లో బోర్లు ఎండిపోయి తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉందన్నారు. సత్వరమే మిషన్‌భగీరథ పనులను పూర్తి చేసి ప్రతిరోజూ అన్ని గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించాలని కోరారు.మిషన్ భగీరథ కాంట్రాక్ట్ మండలపరిధిలోని వారికి ఇస్తే వారు అందుబాటులో ఉండి పనులు పర్య వేక్షించడం, అధికారులకు స్పందించేవారన్నారు. గ్రామాలలో లీకేజీలు ఉండి,నీరు అన్ని గ్రామాలకు సరఫరా కావడం లేదని ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యదర్శులు సభ దృష్టికి తీసుకొచ్చారు.డీఈ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలో 15 గ్రామాలు మట్టపల్లి బ్లాక్‌లో, 8 గ్రామాలు అవంతీపురం బ్లాక్‌లో ఉన్నా యన్నారు.ప్లాంట్ రిపేర్ జరుగుతున్నందున నీటి సరఫరాలో జాప్యం జరిగిందని, వర్క్ పూర్తి కాగానే సవ్యంగా సరఫరా జరుగు తుందన్నారు. గ్రామా లలో పైపులైన్ల నిర్వహణ, మెయిం టనెన్స్ను గ్రామపంచాయతీలు చూసు కోవాలన్నారు. పెండింగ్ పనులు వేగవంతం చేస్తామన్నారు.గ్రిడ్ డీఈ అభినరు మాట్లాడుతూ అన్ని గ్రామాలలోని టాంక్లకు నీరు ఎక్కిస్తున్నమన్నారు. మట్టపల్లి ప్లాంట్ రిపేర్ జరుగుతున్నందున జాప్యం జరిగిం దన్నారు. గ్రామాలలో అక్రమ కనెక్షన్స్ తొలగించాలని, పైపులైన్లు ధ్వంసమైన దగ్గర గ్రామపంచాయతీ వారు మరమ్మతులు చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు మీసాలఉపేందర్, వైస్‌ఎంపీపీ పిన్నెల్లి ఉపేందర్‌రావు, ఎంపీటీసీ దొంగల వెంకటయ్య, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కిష్టిపాటి అంజిరెడ్డి, సర్పంచులు బైరెడ్డి నాగలక్ష్మీ, బోగాల వీరారెడ్డి, కష్ణారెడ్డి, సుమన్, ఎంపీడీఓ జానయ్య, ఎంపీఓ దయాకర్, ఏఈలు మహేష్, శ్రీకాంత్, పంచాయితీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.