Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలసత్యం వహిస్తే చర్యలు తప్పవు
- సూర్యాపేట కలెక్టర్ వినరుకృష్ణారెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో మనఊరు-మనబడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలలలో చేపట్టాల్సిన పనుల అంచనా వివరాలను సత్వరమే అందించాలని విద్య, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ టి.వినరుకష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో మన ఊరు-మనబడి కార్యక్రమంపై అదనపుకలెక్టర్ పాటిల్ హేమంత్కేశవ్తో కలసి సమావేశం నిర్వహి ంచారు.ఈ సందర్భంగా ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో మొదటి విడతగా 329 పాఠశాలలను ప్రభుత్వం ఎంపిక చేసిందన్నారు.ఎంపికైన పాఠశాలల వారిగా ఎస్ఎంఎస్ కమిటీలతో మౌలిక వసతులకల్పనపై సమావేశాలు నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు. ముందుగా ప్రభుత్వ అకౌంట్, దాతల అకౌంట్ విడిగా తీయాలన్నారు.అలాగే మిగిలి ఉన్న ఎస్ఎంఎస్ సమావేశాల ప్రక్రియను త్వరలో పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.ప్రభుత్వం నిర్దేశించిన 12 అంశాలకు లోబడి పనులు చేపట్టాలని ఆదేశించారు.ఎంపికైన పాఠశాలలలో స్థలాలు తక్కువ ఉన్నవాటి వివరాలను ముందుగా గుర్తించి నివేదికలు అందించాలని సూచించారు. 329 పాఠశాలలకు గాను ఎస్ఎంఎస్ సమావేశాలు 43 నిర్వహి ంచడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.పనులలో అలసత్యంగా వ్యవ హరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాఠశాలల్లో చేపట్టాల్సిన పనుల అంచనా వివరాల నివేదికలను సత్వరమే అందించాలని అదేశిం చారు.తదుపరి అందచేసిన నివేదికల ఆధారంగా అదనపు కలెక్టర్లతో పాటు తాను పాఠశాలలను పరిశీలిస్తానన్నారు.ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి ఆ దిశగా సత్వరమే మిగిలిన పనులపై చర్యలు చేపట్టా లన్నారు.పాఠశాలలో చికెన్షెడ్స్, ప్రహరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలను ఉపాధి నిధుల ద్వారా చేపట్టాలని ఆదేశించారు.ఈ సమావేశంలో డీఈఓ అశోక్, ఏడీ శైలజ, ఈడబ్య్లూఐడీసీ డీఈ రమేశ్, ఇంజనీరింగ్ శాఖల ఏఈలు తదితరులు పాల్గొన్నారు.