Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్యే జూలకంటిరంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
గాదె శ్రీనివాసరెడ్డి ఆశయాలను సాధించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి కోరారు.బుధవారం పట్టణంలోని రామచంద్రగూడెంలో శ్రీనివాస్‌రెడ్డి 40వ వర్థంతి సభ సందర్భంగా జూలకంటి పూలమాలలేసి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం శ్రీనివాస్‌రెడ్డి విశేష కషి చేశారన్నారు.పార్టీ నిర్మాణంలో ఆయన పాత్ర కీలకమన్నారు. నేటి యువతను స్ఫూర్తిగా తీసుకొని పీడిత వర్గాల ప్రజల కోసం బలమైన ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఎంతో మంది పేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్లు ఇప్పించి అదుకున్నారన్నారు.అనేక కేసులకు, నిర్బంధాలకు తట్టుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు.ఎర్రజెండా ఎత్తుకొని చివరి వరకు పోరాడారని చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి గాదె పద్మ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు రవినాయక్, భావండ్ల పాండు, పోలేబోయిన వరలక్ష్మీ, అయ్యూబ్, తిరుపతి, రామ్మూర్తి, వినోద్‌నాయక్, శశిధర్‌రెడ్డి, బాలసైదులు, బాబునాయక్, రొండి శ్రీనివాస్, రాంచంద్రు, అరుణ, గంగరాధమ్మ, వేములపల్లి వైస్‌ఎంపీపీ పాదూరి గోవర్థన, దేశీరాంనాయక్, ఖరీమున్నిసాభేగం, వీరాచారి, పాల్వాయిరాంరెడ్డి, బీఎంనాయుడు, సైదానాయక్, జగన్నాయక్, పొలగాని శ్రీనివాస్, వెంకట్‌రెడ్డి, అంకెపాక సైదులు పాల్గొన్నారు.