Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి శివాలయంలో శివపార్వతుల కల్యాణం బుధవారం కన్నుల పండుగగా జరిగింది.ముందుగా మహాదేవ నామేశ్వరస్వామి దేవాల యం నుండి స్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా ఎరకేశ్వరాలయం వద్ద మేళతాళాలతో సంప్రదాయ నత్యాలు చేస్తూ ఓం నమః శివాయ, హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణ చేస్తూ తీసుకొచ్చారు.ఈ కార్యక్రమంలో అర్చకులు పులి హరిప్రసాదశర్మ,దేవాలయ కమిటీ చైర్మెన్ వల్లాల సైదులుయాదవ్, డైరెక్టర్లు చెరుకుపల్లి కష్ణకుమారి, సందీప్, సందేనబోయిన నవ్య,నజీర్, నక్క నాగరాజు, చింత నవీన్, మండలినాగయ్య, కుమ్మరికుంట ్లనాగ రాజు, ఉల్లెందుల మారయ్య, చెరుకుపల్లి వెంకన్న, అర్చ కులు మునగలేటిసంతోష్శర్మ, నందీశ్వరశర్మ పాల్గొన్నారు.
పెన్‌పహాడ్ : మండలంలోని నాగులపహాడ్ గ్రామంలోని శ్రీశ్రీశ్రీ త్రికుటేశ్వర అలయ కమిటీ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం ఉప్పల రామూర్తి జ్ఞాపకార్థం ఆయన కుమారులు, కోడళ్లు ఉప్పల ఆనంద్ లలిత, ఉప్పల కుసుమ ప్రవీణ్ సుమారు 2500 మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వ్యవసాయ కమిటీ చైర్మెన్ ఉప్పల లలిత ఆనంద్ ప్రారంభించారు.అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కబడ్డీ, కోలాటం పోటీలను సర్పంచ్ రాయిలక్ష్మిశ్రీనివాస్, ఆలయకమిటీ చైర్మెన్ కొండ జానకిరాములు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నెమ్మాది భిక్షం,పీఏసీఎస్ చైర్మెన్ నాతాల జానకిరాంరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, మాజీ ఆలయ కమిటీ చైర్మెన్ సంకరమద్ది శ్రవణ్‌రెడ్డి, సంకరమద్ది నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
అదేవిధంగా అనంతారం గ్రామంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని జెడ్పీటీసీ మామిడి అనితఅంజయ్య, సర్పంచ్ బైరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు పొదిల నాగార్జున, సామాజిక కార్యకర్త మామిడి పరంధాములు పాల్గొన్నారు.
మండలపరిధిలోని నాగులపహాడ్ త్రికూటేశ్వర ఆలయంలో, అనంతారం గ్రామంలోని శంభులింగేశ్వర ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా టీపీసీసీ కార్యదర్శి పటేల్ రమేశ్‌రెడ్డి,కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రత్యేకపూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గద్దల నాగరాజు, జిల్లా నాయకులు బచ్చుపల్లినాగేశ్వరరావు, మండలిజ్యోతి పిచ్చయ్య, ఒగ్గుదేవయ్య, సంకరమద్ది సుధీర్ రెడ్డి, దామోదర్‌రెడ్డి, కొండల్, వీరయ్య, కిరణ్, సతీష్ పాల్గొన్నారు.
కోదాడరూరల్: మండలంలోని తొగర్రాయి గ్రామంలోని ప్రాచీన భ్రమరాంబా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా శివరాత్రి వేడుకలలో భాగంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణం మంగళవారంరాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు.స్వామివార్లకు నూతన పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను యాదా శ్రీనివాసరావు,మీనా, ఉపేందర్-సంగీత, వేణు-కష్ణకుమారి, వేణు-సుజాత దంపతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొంగలలక్ష్మీనారాయణ, దేవాలయ కమిటీ సభ్యులు నందులశాస్త్రి, హనుమంతరావు,వెంకటేశ్వర్లు, పాండయ్య,సత్యనారాయణ, నర్సయ్య, కోటేశ్వరరావు, మధు, కొండలు, యాదగిరి, రామారావు పాల్గొన్నారు.
మాడ్గులపల్లి :మండలంలోని కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీశివపార్వతుల కల్యాణ మహోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అర్చకులు వేణుగోపాలశర్మ, భక్తులు పాల్గొన్నారు.