Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరేడుచర్ల
మున్సిపల్ పరిధిలోని సమీకత వెజ్,నాన్వెజ్ మార్కెట్ నిర్మాణపనులకు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని సీపీఐ(ఎం) 8వ వార్డు కౌన్సిలర్ కొదమగుండ్ల సరితా నగేష్ డిమాండ్ చేశారు.బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నెస్పీ క్యాంపులో ప్రజల సౌకర్యార్థం రూ.3.90 కోట్లతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ శంకుస్థాపనలో కౌన్సిల్ సభ్యులను అవమానపరి చేవిధంగా అధికారులు వ్యవహరించారని విమర్శించారు.శిలాఫలకం దగ్గర, శంకుస్థాపన దగ్గర, కనీసం కౌన్సిలర్ల పేరు పెట్టి పిలవలేదన్నారు.కౌన్సిల్ సభ్యులంతా ఒకేసారి వచ్చి కొబ్బరికాయలు కొట్టాల నడం అవమానకరంగా ఉన్నదన్నారు. సభావేదికపైకి కూడా కౌన్సిలర్లు వచ్చి కూర్చోవాలని చెప్పడం కూడా అవమా నకరంగా ఉందని, పేరు పెట్టి పిలువ లేదన్నారు.కానీ సంబంధం లేని ప్రజా ప్రతినిధులను వేదికపైన కూర్చోబెట్టడం ఏంటని ప్రశ్నించారు.వెంటనే ప్రొటోకాల్ పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.