Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అర్వపల్లి
మండల పరిధిలోని కోడూరు గ్రామానికి చెందిన దేశగాని జానయ్య గీత కార్మికుడికి రూ.15వేలను తాడి టాపర్ కార్పొరేషన్ చైర్మెన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం సహాయంతో బాధిత కుటుం బానికి తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్కాపూర్ శ్రీకాంత్‌గౌడ్ చెక్కును అందజేశారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, గౌడ సంఘం మండల అధ్యక్షులు గుండగాని సోమేశ్గౌడ్, తెలంగాణ గౌడ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా ఇన్చార్జి నాతి మధుగౌడ్, సాయి, రమేశ్, గీత కార్మికులు పాల్గొన్నారు.