Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎండ కాలంలో నీడ ఎట్లా అని ఆందోళన
- వేప పుల్లలతో దంతాలుతోమడానికి జంకుతున్న గ్రామస్తులు
నవతెలంగాణ -ఆలేరురూరల్
సర్వరోగ నివారణ పేరుపొందిన వేప చెట్లు తెగుళ్లబారిన పడ్డాయి. ఎన్నో రకాల ఔషధాల తయారీకి ఉపయోగపడే వేప చెట్టు ఎండిపోతోంది. పర్యావరణానికి మేలు చేసే వేపచెట్టు ఆలేరు మండలంలోని పలు ప్రాంతాల్లో పూర్తిగా ఎండిపోయాయి.
ఎన్నో ఔషధాలు తయారీకి ఉపయోగం..
వేప చెట్ల ఔషధ గణాలు అన్ని ఇన్ని కావు సబ్బులు, పేస్టులు, ఔషధాల తయారీకి ఉపయోగపడుతుంది. మార్కెట్లో వీటికి భారీగా డిమాండ్ ఉంది. వేప ఆకులు, పువ్వులు, కాయలు అన్ని ఔషధాలే .ఆయుర్వేదంలో వేపచెట్టు కీలక పాత్ర పోషిస్తుంది. వేప యాంటీబ్యాక్టీరియ. యాంటీ ఫారెసిటీ, యాంటీ ఫంగల్, చాలా మందులు, సౌందర్య ఉత్పత్తుల్లో చోటు కల్పించారు. వేప నూనెతో సబ్బులు ,షాంపులు తయారుచేస్తారు. కాలేయ పనితీరు మెరుగుపరచడం ,రక్తంలో చక్కెర స్థాయిలను సమానం చేయడంలో వేపాకు పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వెచ్చని నీటిలో వేప ఆకులు కలిపి స్నానం చేయడంలో చర్మ సంబంధమైన వ్యాధులు తగ్గుతాయి. సేంద్రియ ప్రకతి పంటలు పండించే రైతులకు వేప చెట్లు ఎండిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎట్లా ఎండిపోతున్నాయి
వానకాలంలో మొదలయ్యే ఈ తెగులు గాలి వాన కీటకాల ద్వారా వాహకాల ద్వారా వేపల కు వ్యాధి సోకి విస్తరిస్తుందంటున్నారు.. 80 శాతానికి పైగా వేప చెట్లు తెగులు బారిన పడ్డాయని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. మనుషులకు కరోనా వ్యాధి ఎట్లా వచ్చిందో వేప చెట్టుకు కూడా అదేవిధంగా వచ్చిందని కొంతమంది అనుకుంటున్నారు.
గ్రామ ప్రజల్లో భయం
వేప చెట్టు ఎండి పోవడతో ఏదో అరిష్టం జరగబోతుంది అంటూ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. చెట్లు ఎండిపోవడానికి శాస్త్రీయ కారణాలు తేలవకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు. దీంతో కొన్ని గ్రామాలలో వేప పుల్లలతో దంతాలు తోముకుని ఎందుకు భయపడుతున్నారు. ఈ పరిణామాలపై ఎవరు భయపడవలసిన అవసరం లేదని చెబుతున్న కింది స్థాయి వారికి చేరడం లేదు అని అంటున్నారు . కొన్ని చెట్లు చనిపోయిన కొన్ని మాత్రం వసంతకాలంలో చిగురిస్తోందని చెబుతున్నారు. సాధారణంగా శీతాకాలం వెళ్ళాక వేప వక్షాలు మళ్ళీ అంతట అవే చిగురిస్తాయి అని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వేప వక్షాల సంబంధిత అధికారులు నిపుణుల కమిటీ వేసి పర్యావరణ పరిరక్షణ కాపాడాలని ఔషధగుణాల చెట్టును కాపాడాలని ప్రజలు కోరుతున్నారు..
వేప పుల్లతో దంతాలు తోమాల అంటే భయం
రచ్చ రమనర్సయ్య.. శరజిపేట గ్రామస్తుడు
మా ఊరిలో కాకుండా చుట్టుపక్కల ఊర్లో కూడా వేప చెట్లు ఎండిపోతున్నాయి. రోజు ఉదయం లేవగానే వేపపుల్ల వేసి దంతాలు శుభ్రం చేసుకున్నటోళ్లం. కానీ ఇప్పుడు వేపపుల్ల వెయ్యాలంటనేే భయం వస్తుంది.ఏమైనా తెగుళ్లు ఉంటే మాకు కూడా వస్తందని వేప చెట్టు దగ్గరికి వెళ్లడం మానేశా.
మందులు పిచికారి చేయాలి
మండల ఏఓ పద్మజ
తెగుళ్లతో ఎండిపోతున్న చెట్లకు ఎక్కువ నీళ్లు పెట్టాలి. ఎక్కువ నీళ్ళు పెడితే తొందరగా కోలు కుంటుంది. మోనోక్రోటోఫాస్ బాబిస్టిన్, అనే ఫంగిసైడ్ వాడొచ్చు. చిన్న చెట్లయితే కొమ్మలు కత్తరించి కాల్చివేయాలి.