Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తుర్కపల్లి
మండలంలోని పల్లెపాడు గ్రామంలోని శివాలయంలో మంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ సొక్కుల లతామోహన్రెడ్డి సహకారంతో రాళ్ళబండి సుధారాణి సుగ్రీవ చారి ,భుశెట్టి లక్ష్మీ అశోక్ దంపతుల ఆధ్వర్యంలో కల్యాణ తంతుని నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్వామివారిని ఊరేగించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ దేశపాండే లక్ష్మి , సతీష్, రాజశేఖర్ పాల్గొన్నారు.
ఆలేరుటౌన్ : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున పట్టణంలోని శివాలయాలు , పరిసర ప్రాంతాలు బహదూర్పేట, సాయిగూడెం శివాలయాలు , పట్టణం లోని చాముండేశ్వరి ఆలయంలో , భక్తుల సమక్షంలో లింగోద్భవ వేడుకలు నిర్వహించారు. శ్రీ కనకదుర్గ ఆలయం, శ్రీ గోదాదేవి లక్ష్మీదేవి సహిత రంగనాథ ఆలయం, శ్రీ ఆంజనేయ ఆలయంలో భక్తులు పూజలు చేశారు. శివ పార్వతుల కల్యాణం వేద మంత్రోచ్ఛారణల మధ్య
కోలాహలంగా నిర్వహించారు. ఆలేరు మాజీ శాసనసభ్యులు డాక్టర్ కె నగేశ్ ,మాజీ శాసన సభ్యులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బూడిద భిక్షమయ్య గౌడ్ ,బీర్ల ఫౌండేషన్ చైర్మెన్ బీర్ల అయిలయ్య,కల్లూరి రామచంద్రా రెడ్డి కుటుంబసమేతంగా శివాలయాలను దర్శించుకున్నారు. కూరగాయల వ్యాపారి మోహన్ దాస్, నాని, శ్రీస్వయంభు శింబు లింగేశ్వర ఆలయం గొలనుకొండ వద్ద భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఆలేటి రంగన్న, వేదాటి సత్యనారాయణశాస్త్రి ,మంగళగిరి శేషగిరి, మంగళగిరి వరదరాజులు, రఘు కుమార్ , పాండు, టి చక్రధర్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు ,ప్రజాప్రతినిధులు, వివిధ ఆలయాల కమిటీ సభ్యులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బొమ్మలరామారం :మండలంలోని మర్యాల గ్రామంలో శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో ఉదయం అగ్ని గుండాలు అనంతరం స్వామివారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. పంతులు శశిధర్ శర్మ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సర్పంచ్ దామోదర్ గౌడ్, కొండ్రా గోవర్ధన్, గ్రామం ప్రజలు, యువకులు పాల్గొన్నారు.
మోత్కూరు : మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామంలోని శ్రీ బుగ్గరామలింగేశ్వరస్వామి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణం, అగ్నిగుండాలను భక్తులు ఘనంగా నిర్వహించారు. గుట్టపైన ఆలయంలోమంగళవారం రాత్రి శివపార్వతుల కల్యాణోత్సవాన్ని పండితులు మోత్కూరు ప్రదీప్ శర్మ భక్త జనసందోహం మధ్య వైభవంగా నిర్వహించారు. బుధవారం ఉదయం భక్తులుశివపార్వతులను పల్లకిలో మోస్తూ గ్రామంలోని వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. బండ యాదగిరి సహకారంతో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పైళ్ల విజయనర్సిరెడ్డి, వైస్ ఎంపీపీ బుశిపాక లక్ష్మీ, ఉపసర్పంచ్ మల్లేష్, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు పైళ్ల సోమిరెడ్డి, మాజీ సర్పంచ్ తండ సత్తయ్య, కేమిడి సైదులు, ఎం.శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట: మండలంలోని సిరిపురం గ్రామ శివాలయంలో బుధవారం శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండగ, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ పున్న లక్ష్మీ జగన్మోహన్, గ్రామ సర్పంచ్ అప్పం లక్ష్మీ నర్సు, పీఏసీఎస్ వైస్ చైర్మెన్అంబటి సురేంద్రమ్మ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ బడుగు రమేష్, ఆలయ కమిటీ చైర్మెన్ రాపోలు స్వామి, ఉప సర్పంచ్ దాసి రెడ్డి శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గోని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీఏసీఎస్ వైస్ చైర్మెన్అంబటి సురేంద్ర రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అప్పం రామేశ్వరం, కూనూరు ముత్తయ్య, మాజీ ఎంపీటీసీ పున్న వెంకటేశం, అప్పం పెంటయ్య, రాపోలు రామేశ్వరం, అప్పం గోయల్, భక్తులు పాల్గొన్నారు.