Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
2020-21, 2021-22 రెండు ఆర్దిక సంవత్సరాలకు గిరిజన కార్పొరేషన్ బడ్జెట్ను ఒకేసారి విడుదల చేసింది. అయితే 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన లబ్దిదారుల ఎంపికను మొదటగా పూర్తిచేసి, ఆ తర్వాత రెండో ఏడాది రుణాల ఎంపికకు పరిశీలన చేయాలని నిర్ణయం చేశారు. అయితే రెండేళ్లకు కలిపి సుమారు 3516 యూనిట్లకు బడ్జెట్ విడుదల చేసి సుమారు పది నెలలు దాటింది. కానీ ఒక్క మండలంలో కూడా పూర్తిస్థాయిలో గిరిజన యువతకు రుణాల పంపిణీ జరగలేదు. మోజార్టీ ప్రాంతాలలో గ్రామ స్థాయిలోనే లబ్దిదారుల ఎంపిక జరగలేదు. మరి కొన్ని ప్రాంతాలలో బ్యాంకులలో దరఖాస్తులు మూలుగుతున్నాయి. పేద నిరుద్యోగులైన యువతకు ఆర్థిక సాధికారిత సాధించేందుకు ఇచ్చే రుణాల కోసం లబ్దిదారులను ఎంపిక చేయడానికి గ్రామాలలో అధికారులకు తీరికలేకుండా పోయిందంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో తెలుస్తుంది.అనేక కాంట్రాక్టు పనులకు సభలు, సమావేశాలు పెట్టే అధికారులు ఒక్క రోజు గిరిజన పేదల కోసం కేటాయించలేకపోతున్నారు. అయితే బ్యాంకులలో గిరిజన యువతకు రుణాలు ఇవ్వడానికి ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు నల్లగొండ జిల్లాలోని సుమారు 70 వరకు లబ్దిదారుల దరఖాస్తులు బ్యాంకులకు చేరినట్లు, మరో 23 మంది లబ్దిదారుల ఎంపికకు సంబందించిన ఫైల్ కలెక్టర్ కార్యాలయానికి చేరినట్టు తెలుస్తుంది. కనీసం 5శాతం కూడ లబ్దిదారుల ఎంపిక జరగలేదు.
బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలివ్వాలి
రవినాయక్, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ.
నిరుద్యోగ గిరిజనులకు ఇచ్చే రుణాల ప్రక్రియ పూర్తిగా బ్యాంకులలో పెండింగ్లో ఉంటున్నాయి. అనేక కొర్రీలు పెడుతున్నారు. అందుకే బ్యాంకులతో సంబంధం లేకుండా రుణాలు అందజేయాలి. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున పంపిణీ వేగవంతం చేయాలి.