Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నల్లగొండ
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని పానగల్ శ్రీ ఛాయా సోమేశ్వరాలయంను బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం చైర్మెన్ ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు.వేద ఆశీర్వచనం అందచేసి స్వామి శేష వస్త్రం తో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా చారిత్రక ప్రాధాన్యత కలిగిన దేవాలయాలను దర్శించుకోవడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందన్నారు.ఈ కార్యక్రమంలో గంట్ల అనంత రెడ్డి , పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా అగ్ని గుండాలు
పానగల్ ఛాయాసోమేశ్వరాలయంలో స్వామివారికి బుధవారం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో అగ్ని గుండాలు నిర్వహించారు.సందర్భంగా భక్తులు స్వామి వారి విగ్రహాలను పల్లకీలో ఎత్తుకొని అగ్ని గుండాలు తొక్కారు. ఈ వేడుకల్లో ఆలయ చైర్మెన్ అనంతరెడ్డి పాలకమండలి సభ్యులు, ఆలయ అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.