Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
ఈ నెల 5న భువనగిరిలోని వర్తక సంఘంలో నిర్వహించనున్న సీఐటీయూ జిల్లా విస్తతస్థాయి సమావేశం జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి దాసరి పాండు అన్నారు. మంగళవారం భువనగిరి మండలపరిధిలోని కూనూర్ గ్రామంలో ఉన్న రైస్ మిల్లు కార్మికుల సమావేశాం జానీ అధ్యక్షతన నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించాయని కార్మిక చట్టాలు కనీస వేతనాలు అమలు చేయకుండా యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్నారన్నారు. నిత్యం కార్మికుల మీద పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరలు పెంచి భారాలు మోపుతున్నారన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను చర్చించి భవిష్యత్ కార్యక్రమాలు రూపొందించుకొని పోరాటాలకు సిద్ధం అవుతామన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి భూపాల్ హాజరవుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బాల్ నరసింహ, కనుకయ్య, బాలరాజు, ముత్యాలు అయిలయ్య పాల్గొన్నారు.
కలెక్టరేట్లో లేబర్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక గదిని కేటాయించాలి
భువనగిరి : నూతనంగా ప్రారంభించిన సమీకత జిల్లా కలెక్టరేట్లో లేబర్ డిపార్ట్మెంట్కు ప్రత్యేక గదిని కేటాయించాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఎ.ఓ) నాగేశ్వరాచారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్లో రెండో అంతస్తులో ఎస్4 గదిలో లేబర్ ఆఫీస్ తో పాటు యూత్ అండ్ స్పోర్ట్, తూనికలు, కొలతలుకు సంబంధించిన మూడు డిపార్ట్మెంట్స్ కు కేటాయించడం వల్ల రెండు డిపార్ట్మెంట్స్ వాళ్ళు తెచ్చిన వాళ్ళ ఫర్నీచర్‌తో నిండిపోయిందన్నారు. ఇంకో డిపార్ట్మెంట్ వారి ఫర్నీచర్ పట్టే పరిస్థితి లేదన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే అత్యధిక పరిశ్రమలు ఉన్న ప్రాంతం భువనగిరి అని గుర్తు చేశారు. యాజమాన్యం, కార్మికుల మధ్య తలెత్తే సమస్యల పరిష్కారం కోసం వారంలో రెండు రోజులు డీసీఎల్ జాయింట్ మీటింగ్ లు జరపితే 20-30 మంది కూర్చోవల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డులో జిల్లా వ్యాప్తంగా సుమారు 50వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారని, వారికి సంబంధించి ప్రతి రోజూ కార్డు నమోదు, రెన్యూవల్, క్లెయిమ్స్ కోసం భవన నిర్మాణ కార్మికులు ఆఫీసుకు వస్తుంటారని తెలిపారు.