Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మోత్కూరు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు డిమాండ్ చేశారు. మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో బుధవారం ఆ పార్టీ గ్రామశాఖ సమావేశం చింతకింది సోమరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన ఏడున్నరేళ్లలో ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. జీఎస్టీ, నోట్ల రద్దు, విద్యుత్, రైతు వ్యతిరేక చట్టాలు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెంపుతో ప్రజల నడ్డి విరిచారన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల కోసమే పథకాలు తెచ్చి ఆ తర్వాత వాటి అమలును విస్మరిస్తున్నారని, దళితబంధు పథకం అలా కాకుండా పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ, నిరుద్యోగ భతి, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూం ఇళ్లు, అర్హులకు పింఛన్లు, రేషన్‌కార్డులు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆ పార్టీ గ్రామశాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, మండల కమిటీ సభ్యులు దడిపెల్లి ప్రభాకర్, కొంపెల్లి ముత్తమ్మ, వడ్డేపల్లి లక్ష్మణ్, కొంపెల్లి గంగయ్య, వెండి యాదగిరి తదితరులు పాల్గొన్నారు.