Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
జనాబాలో సగానికి పైగా ఉన్న బీసీలు రాజకీయంగా, ఉద్యోగపరంగా వివక్షకు గురవుతున్నారని, బీసీఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్నాల వెంకన్న యాదవ్ కోరారు. జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షులు కృష్ణయ్య ఆదేశాల మేరకు బుధవారం నియామకపత్రాలు అందవజేశారు.నూతనంగా ఎన్నికైన వెంకన్న యాదవ్ మాట్లాడుతూ బీసీ కమిషన్ చైర్మెన్ బీపీమండల్ ప్రతిపాదించిన సిఫార్సులలో 27 శాతం రిజర్వేషన్లు తప్ప ఏ ఒక్క సిఫార్సును అమలు చేయకుండా ప్రభుత్వాలు బీసీ పట్ల సవతితల్లి ప్రేమను చూపిస్తున్నారన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించకుంటే మార్చిలో జరగబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో పార్లమెంట్‌ను ముట్టడి స్తామని,పోరాడేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వెంకన్నయాదవ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేసిన వారిలో చిమట మదార్, పశుల కాశయ్య, కన్నెబోయిన వెంకటేశ్వర్లు, నల్లమేకల వెంకయ్య, గుడిపాటి కోటయ్య, మారం శ్రీనివాస్, గంగపుత్ర సైదులు, ఠాకూర్‌సింగ్, గుర్వయ్య, నాగెల్లి ఉపేందర్,బొమ్మనబోయిన శ్రీనివాస్,పోలెబోయిన జనార్దన్ ఉన్నారు.