Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలగిరిసాగర్ : మండలంలోని రాజవరంలో మహాశివరాత్రి పర్వది నాన్ని పురస్కరించుకొని బుధవారం ఎమ్మెల్సీ కోటిరెడి మల్లప్పస్వామిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.అనంతరం శివపార్వతుల కల్యాణం జరిపించారు.అదేవిధంగా నూతనంగా నిర్మించిన శివుడి విగ్రహం,నంది విగ్రహాల వద్ద పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోలేపల్లి సైదమ్మ అంజయ్య, బోయగూడెం సర్పంచ్ నెమలి సునీతాకృష్ణారెడ్డి, అనుముల మండల మాజీ ఎంపీపీ సలహాదారుడు అల్లి పెద్దిరాజుయాదవ్, మాజీ మండలఅధ్యక్షులు బీవీ.రమణ, రాజు, ఉప సర్పంచ్ దండగాలయ్య, అద్దాల మల్లయ్య, ఇసుకమల్లయ్య, గడ్డమీది నాగార్జున, లింగాల శంకర్ పాల్గొన్నారు.