Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ జిల్లా అధ్యక్షులు ఎండీ.అంజద్
నవతెలంగాణ-మిర్యాలగూడ
టీఆర్టీ 2017లో పెండింగ్లో ఉన్న 535 ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఆవాజ్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అంజద్ డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో గురువారం జరిగిన ఆవాజ్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ 6 సంవత్సరాలుగా ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వం ఉర్దూ మీడియం విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నదన్నారు. 900 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం కేవలం 365 పోస్టులు భర్తీ చేసి 535 పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు. పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని, మరోవైపు ఉపాధ్యాయులు లేక విద్యార్థులకు చదువు అందడం లేదన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే 535 ఉర్దూ మీడియం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆయుబ్, డీవైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు పాతని శ్రీను, అవాజ్ నాయకులు ఎండీ. అదిల్, వాదూద్, సమద్, పాషా, ముక్తార్, జానీ పాల్గొన్నారు.