Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -వలిగొండ
మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం తహసీిల్దార్ శ్యాంసుందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల కార్యదర్శి వేముల నాగరాజు మాట్లాడుతూ మండలంలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులు సుమారు 1500 ఉన్నారని తెలిపారు. ఇంటర్ విద్య కోసం రామన్నపేట, భువనగిరి ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎవరు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మండల కేంద్రంలో కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో నాయకులు వేముల జ్యోతిబసు, మల్లేశం ,పోలే పాక విష్ణు ,పవన్ ఉన్నారు .