Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -తిరుమలగిరి
పట్టణంలోని శుభమస్తు ఫంక్షన్ హాల్లో గురువారం తుంగతుర్తి నియోజకవర్గ స్థాయిలో మన ఊరు - మన బడి అవగాహనా సదస్సునిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్, కలెక్టర్ వినరు ష్ణారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్ని తీర్చిదిద్దటమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అన్నారు. 7,289 కోట్లు మన ఊరు మన బడికోసం మంజూరయ్యాయని తెలిపారు. ఈనెల 8న ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తిలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, జిల్లా రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్.ఎ రజాక్, నల్గొండ డీఈవో బిక్షపతి, యాదాద్రి డీఈవో నరసింహ, సూర్యాపేట డీఈఓ కే. అశోక్, మార్కెట్ చైర్మన్ లు, మున్సిపల్ చైర్మెన్లు , ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పీఏసీఎస్ చైర్మెన్లు, సర్పంచ్ ఎంపీటీసీలు, పాఠశాల ల ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీ చైర్మెన్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ సూపర్వైజర్ లక్ష్మి, పోలీస్ సిబ్బంది సైదులు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.