Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేషన్ డీలర్లతో సమావేశం
- అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు
నవతెలంగాణ -సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో మినీ సిలిండర్లను రేషన్ షాపుల ద్వారా విక్రయాలు జరిపేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నట్టు అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు అన్నారు. గురువారం జిల్లాలోని రేషన్ డీలర్స్‌తో మినీ సిలిండర్ విక్రయాలపై సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ షాపులలో మినీ సిలిండర్ విక్రయాలకు సంబంధిత డీలర్ల నుండి ఎలాంటి అనుమతులు అవసరం లేదని కమర్షియల్ పర్పస్‌లో విక్రయలు పెంచుకుంటే ఆయిల్ కార్పొరేషన్ డీలర్స్‌తో ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. వ్యాపారులు వాణిజ్య అవసరాలకు మినీ సిలిండర్లు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. రేషన్ షాపుల ద్వారా విక్రయించే డీలర్లకు సిలిండర్ ఒక్కంటికి రూ.41 కమిషన్ చెల్లించడం జరుగుతుందని, డిపాజిట్ రూపంలో రూ.940 చెల్లిస్తే రూ.620లకే మినీ సిలెండర్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. రేషన్ షాపులలో విక్రయాలను బట్టి 20 సిలిండర్లు నిల్వ చేసుకోవచ్చని అన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీలు , పెద్ద గ్రామాలలో 5 కిలోల మినీ సిలెండర్లు ఎక్కువగా విక్రయాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే గ్యాస్ ఏజెన్సీ లతో సమావేశాలు నిర్వహించామని కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న వ్యాపారుల వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నారన్నారు. సంబంధిత ఆయిల్ కంపెనీ డీలర్స్ రేషన్ షాపులకు సరఫరా చేస్తారని రేషన్ డీలర్లకు ఆదాయం కల్పించడంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. దీంతో బ్లాక్ మార్కెట్ ను పూర్తిగా కట్టడి చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్డీఎం జగదీష్ చంద్ర బోస్, డీఎస్ఓ విజయ లక్ష్మి, డీఎం రాంపతి, ఏఎస్ఓ పుల్లయ్య, డీటీ రాజశేఖర్,రేషన్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలి
జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ ఎస్. మోహన్ రావు అన్నారు.గురువారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో కార్యాలయాలు పరిశుభ్రత, ఫైళ్ల నిర్వహణ పై శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇపనికి రాని పాత ఫర్నిచర్, అవసరం లేని పాత ఫైళ్లను నిబంధనల మేరకు తొలగించాలని ఎప్పటికప్పుడు అన్ని కార్యాలయాలు పరిశుభ్రతతో అందుబాటులో ఉంచాలని లేనియెడల ఆయా శాఖల అధికారులు సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఏఓ రామారావు నాయక్, పీడీఐసీడీయస్ జ్యోతి పద్మ, జీఎం పరిశ్రమలు తిరుపతయ్య, ఉద్యాన అధికారి శ్రీధర్, సంక్షేమ అధికారులు శంకర్, శిరీష, దయానంద రాణి, అనసూర్య, ఏఓ శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.