Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పౌరసరఫారాలశాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్
నవతెలంగాణ-నాంపల్లి
ప్రజా పంపిణీలో ఎటువంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించేది లేదని పౌరసరఫరాల శాఖ నల్లగొండ జిల్లా ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్ తీవ్రంగా హెచ్చరించారు. నాంపల్లి మండల కేంద్ర పౌర సరఫరాల సంస్థ గిడ్డంగిని గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో ఏ దశలోనూ ఎలాంటి అవకతవకలు , అక్రమాలు జరగొద్దన్నారు. అక్రమాలు జరిగితే బాధ్యుల పై కఠిన చర్యలకు వెనకాడ బోనహెచ్చరించారు. పేదల బియ్యం రవాణా, సరఫరా , పంపిణీ ఇలా అన్ని దశల్లోనూ పూర్తి పారదర్శకత , సరైన నిర్వహణ ఉండి తీరాలని స్పష్టం చేశారు. గిడ్డంగిలో బియ్యం గణనీయంగా కింద పడి ఉండటం పట్ల డీటీ ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతే గాక గోడౌన్ నుంచి సరకు రవాణా అయిన పలు చౌక్ దుకాణాలను తనిఖీ చేశారు. 'మీకు గిడ్డంగి నుంచి బియ్యం తక్కువగా వస్తున్నయా' అని డీలర్లను అడిగి తెలుసుకున్నారు. 'గోడౌన్లో ఎలాంటి తూకం వేస్తున్నారు.. హమాలీలు ఎందరు...ఎన్ని వాహనాలకు జీపీఎస్ ఉంది.. గుత్తేదారు ఎవరు' అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.