Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటా చలం
నవతెలంగాణ- నేరేడుచర్ల
ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ కాన్పులు ఎక్కువగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ కోటా చలం అన్నారు. గురువారం పెంచికల్ దిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. తదుపరి సిబ్బందికి నిర్దేశించిన ఆరోగ్య సేవల లక్ష్యాలను సమీక్షించారు. ప్రభుత్వాస్పత్రుల్లో సాధారణ కాన్పులు జరిగితే ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుతాయని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో సాధారణ కాన్పులు నిర్వహించాలని వైద్యాధికారి డాక్టర్ హరికిషనను ఆదేశించారు. అర్హులైన పిల్లలందరికీ టీకాలు ఇప్పించాలని, దీర్ఘకాలిక రోగాలైన బిపి షుగర్ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య సిబ్బంది ఆశా కార్యకర్తలు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని, నిర్ధారణ అయినవారికి ఇంటి వద్దనే మందులు అందించాలని సూచించారు. క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి రోగి పూర్తి కాలపు కోర్సు మందులు వాడేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా వ్యాధినిరోధక అధికారి డాక్టర్ పి.వెంకట రమణ మాట్లాడుతూ టీకాల లక్ష్యాలను పూర్తిచేయాలన్నారు. జిల్లా ప్రోగ్రాం అధికారి జికిరణ్ జాతీయ ఆరోగ్య మిషన్ నిధులు ,కేసీఆర్కిట్టు గురించి వివరించారు. జిల్లా మీడియా అధికారి అంజయ్య గౌడ్ ఇతర శాఖల సమన్వయంతో సమావేశాలు నిర్వహించి ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరికిషన్ , వరమ్మ, బి భాస్కర్ రాజు ,ఆశ ఆరోగ్య కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.