Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తుంగతుర్తి
మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో కాసా జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ప్రజా సంఘాలను బలోపేతం చేయుట అనే అంశంపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐదు రాష్ట్రాల ప్రధాన అధికారి పాలు లూథర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మండలంలోని గ్రామాలలో మహిళా, యువజన, గ్రామ సంఘాలు ప్రతి గ్రామంలో ఉన్న ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి కృషి చేస్తున్న తీరు అభినందనీయన్నారు. విద్య, వైద్య ,ఆహార భద్రత, మహిళా చట్టాల గురించి ప్రతి గ్రామంలో చైతన్యపరుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ కోఆర్డినేటర్ ప్రేమ్ కుమార్, మండల కార్యదర్శి గొడ్డలి నరసన్న, సాల్మన్ ,నవ్య, ధనమ్మ ,సరస్వతి ,భాస్కర్, మధుసూదన్, శామ్యూల్ ,సంతోష్