Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నేరేడుచర్ల
మండలంలోని సోమరం ,బూరుగుల తండ గ్రామంలో నెలకొన్న శ్రీభగు మాలిక సోమప్ప సోమేశ్వర దేవాలయంలో శివరాత్రి జాతర సందర్భంగా వివిధ మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం గురువారం లెక్కించారు. రూ. 3,33 245 వచ్చినట్టు తెలిపారు. వీటిలో హుండీ ద్వారా 1,15,930 రూపాయలు ,టిక్కెట్లు అమ్మకం ద్వారా 66,815 , కొబ్బరికాయలు అమ్మకం ద్వారా 80000 ,లడ్డూ పులిహోర అమ్మకం ద్వారా 70,500 రూపాయలు సమకూరాయి. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మిర్యాలగూడ ఇన్స్పెక్టర్ రమేష్, దేవాలయ చైర్మెన్ రాచకొండ శ్రీనివాసరావు, దేవాలయ ఈవో మత్యుంజయ శాస్త్రి,జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస మూర్తి, ఆలయ పూజారి ఇటువంటి శ్రీనివాసాశర్మ, వైస్ చైర్మెన్ పెండెం సైదులు, ధర్మ కర్తలు వీరప్ప, లక్ష్మీనారాయణ ,పార్వతి, టీిఆర్ఎస్ మండల ఉపధ్యక్షులు సుదర్శన్, ఎమ్మార్వో సరిత ,ఎంపీడీవో శంకరయ్య, ఎస్సై నవీన్ కుమార్ సోమరం, బురుగులు తండా గ్రామ సర్పంచులు, దేవాలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.