Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పెద్దవూర
పెద్దవూర మండల పరిధిలోని వైన్ షాపు పక్క నుంచి ఏఎంఆర్పీ డిస్ట్రిబ్యూటరీ 8 కాలువ వెంట వ్యవసాయబావులకు వెళ్లే 11 కేవీ విద్యుత్ స్తంభాలు ఒరిగి పోయి ప్రమాదకరంగా తయారయ్యాయి. విద్యుత్ వైర్లు చేతికి అందే ఎత్తులో ఉండడంతో వ్యవసాయపనులకు వెళ్లే రైతులు, అక్కడినుంచి వెళ్లే వారు భయాం దోళన చెందుతున్నారు. ఏమాత్రం గాలి వీచినా ,స్తంభాలు కింద విరిగి పడతాయని, ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రాంతంలో రైతులు మిర్చి ని కల్లాల్లో పోసి ఎండ పెడుతూ నిరంతరం అక్కడే ఉంటున్నారు. దాంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయపడుతున్నారు. సంబంధిత అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు దృష్టిసారించి చర్య లు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
రైతులు నా దృష్టికి తీసుకరాలేదు
- దాసు, ట్రాన్స్ కో ఏఈ
విద్యుత్ స్తంభాలు ఒరిగి ప్రమాదకరంగా ఉన్న విషయం ఇంత వరకు రైతులు నా
దృష్టికి తీసుకురాలేదు. వెళ్లి పరిశీలించి ప్రమాదం జరుగకుండా వెంటనే చర్యలు చేపడతాం. రైతులు ఆందోళన చెందనవసరం లేదు.