Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ఈనెల 6వ తేదీ నుండి బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో రాష్ట్రంలో నిర్వహి స్తున్న బహుజనుల రాజ్యాధికార యా త్రలో జిల్లా నుండి అన్ని వర్గాల ప్రజలు, విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జ యప్రదం చేయాలని బీఎస్పీజిల్లా ఇం ఛార్జి పిల్లుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. గురు వారం పట్టణంలో జరిగిన జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. జనగాం జిల్లా కిలాషపురం నుండి ఈయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో బహు జనులకు రాజ్యాధికారం దక్కాలనే ఆశయంతో డాక్టర్ ప్రవీణ్ కుమార్ యాత్ర చేపడుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ యాత్ర సూర్యాపేట జిల్లా లోని అన్ని నియోజకవర్గాలలో కొనసాగుతుందని తెలిపారు. మార్చ్ 6వ తేదీన ప్రారంభ కార్యక్రమానికి, జిల్లాలో జరిగే యాత్రకు అధిక సంఖ్యలో పాల్గొనాలని, బహుజన రాజ్యాది óకారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ఈ సమావేశం పార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు గుండె పంగ రమేష్, నియోజవర్గ కోశాధికారి కందుకూరి ఉపేందర్, టౌన్ ఇంఛార్జి కంభంపాటి శ్రావణ్ కుమార్, నాయకులు సుమన్, కరుణాకర్ రెడ్డి, పవన్ పాల్గొన్నారు.