Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చండూరు
బాలల హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పొనుగోటి అంజన్రావు సూచించారు. గురువారం మున్సిపాలిటీలోని గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, కస్తూరిబా గాంధీ విద్యాలయం, బంగారిగడ్డ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నెర్మట ప్రాథమికోన్నత పాఠశాలలను ఆయన సందర్శిం చారు. బాలల హక్కులపై అవగాహన కల్పించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మన ఊరు - మనబడి, రీడ్ పథకాల అమలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలికవసతులపై ఆరా తీశారు. విద్యార్థులతో మాట్లాడుతూ విద్యార్థుల కోసం బాలల హక్కుల కమిషన్ అండగా ఉంటుం దని తెలిపారు. పదోతరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు దగ్గరలో ఉన్నాయని, విద్యార్థులందరూ ప్రణాళికాయుతంగా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని ఆశించారు. ఈ కార్య క్రమంలో మండల విద్యాధికారి గురువారావు, ఏఎంఓ ఆర్. వీరేందర్, డి ఎంఎల్ టి.వెంకటేశ్వర్లు, నెర్మట ప్రధానోపాధ్యాయులు మధుమోహన్, బం గారిగడ్డ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రామ లింగయ్య, ప్రత్యేక అధికారి మంజుల, గాంధీజీ, విద్యాసంస్థల కరస్పాండెంట్, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడి శ్రీనివాసులు, శిరంశెట్టి శ్రీధర్ బాబు పాల్గొన్నారు.