Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
నవతెలంగాణ-చింతపల్లి
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం అని దేవ రకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండలంలోని ప్రశాంతపురి తండాలో, గడియగౌరారం, నర సర్లపల్లి, తిరుమలాపురం, నేల్వలపల్లి, ఉప్పరపల్లి గ్రామాలలో చేపడుతున్న సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలో పేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు. ఇం దుకు మిషన్ భగీరథ, నిరంతర విద్యుత్, రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఉద్యమ స్పూర్తితో పనిచేస్తే తప్పక మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ కంకణాల ప్రవీ ణావెంకట్ రెడ్డి, ఎంపీపీ భవాని, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గోపిడి కిష్టా రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నా యకులు కంకణాల వెంకట్ రెడ్డి, గున్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉజ్జిని విద్యాసాగర్ రావు, వింజామురి రవి,సుమతి రెడ్డి, కుంభం శ్రీశేలం గౌడ్, అండే కార్ అశోక్, నాదిరి. రమేష్, మాజీ సర్పంచ్ మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు చాంద్ పాషా కేషగోని రవీందర్ గౌడ్ పాల్గొన్నారు.