Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిట్యాల
చిట్యాల మండలం బోయగుబ్బ గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన వారికి మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యా యులు కోమటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్ సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
బొంగొనిచెర్వులో...
స్థానిక ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థ్దులు అధ్యాపకు లుగా మారి తోటి విద్యార్థులకు బోధన చేశారు. ఈ సందర్భంగా బదిలీ పై వెళ్ళిన ఉపాధ్యాయులు నర్మద, సుచిత లను గ్రామ పాలక వర్గం సభ్యులు, పాఠశాల విద్యా కమిటీ, విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. పాలక వర్గం సభ్యులు సామిడి యాదిరెడ్డి, సామిడి పద్మకళ, పంచాయతీ కార్యదర్శి గోలి మల్లేష్, విద్యా కమిటీ చైర్మన్ అంతటి శ్రీనివాస్, ప్రధాన ఉపాధ్యాయులు ధనలక్ష్మి, రజిత, యాదమ్మ, పురుషోత్తం చారి, చంద్రకళ, చిలకమ్మ, ముత్తమ్మ, సుమలత, సంధ్య పాల్గొన్నారు.