Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
భారత రాజ్యాంగానికి కేసీఆర్ రూపంలో వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఈనెల 9న నల్గొండ జిల్లా కేంద్రం లోని స్థానిక లక్ష్మీ గార్డెన్ లో జరుగు నల్లగొండ జిల్లా సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని రా జ్యాంగ పరిరక్షణ వేదిక నల్గొండ జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం జెడ్పీ గెస్ట్ హౌస్లో నల్ల గొండ జిల్లా రాజ్యాంగ పరిరక్షణ వేదిక నాయకులు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని అవమానించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, భారత సమా జానికి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఈ సన్నాహక సదస్సుకు ముఖ్య అతిథులుగా ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ మంద కృష్ణమాదిగ, సభ్యులు ప్రొఫెసర్ హరగోపాల్, కోదం డరాం, జేబీ రాజు, జాజుల శ్రీనివాస్ గౌడ్, అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, ఇందిరా శోభన్, ప్రొఫె సర్ ఖాసిం, గోపాల్, రజి హైదర్, చీఫ్ కో ఆర్డినేటర్ తీగల ప్రదీప్ గౌడ్ హాజరవుతున్నారని తెలిపారు. సదస్సుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మా ర్పీఎస్, ఎమ్మెస్పీ జిల్లా కోఆర్డినేటర్ బకరం శ్రీనివాస్ మాదిగ, తెలంగాణ జన సమితి పార్టీ జిల్లా అధ్యక్షులు పన్నాల గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏస్సి సెల్ జిల్లా అధ్యక్షులు ఆదిమల్ల శంకర్, తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి సైదులు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసి డెంట్ గండి చెరువు వెంకన్న గౌడ్, ఎరుకల సంఘం జిల్లా అధ్యక్షులు మానుపాటి భిక్షం, వీహెచ్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరిక శ్రీనివాస్, మాల మహా నాడు జిల్లా అధ్యక్షులు రేకల సైదులు, టీఎస్యూ జిల్లా అధ్యక్షులు కొండేటి మురళి, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చింతపల్లి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.