Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆప్యాయంగా ఆహ్వానిస్తున్న తల్లిదండ్రులు
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
మండలంలోని డాకు తండాకు చెందిన కరెంటుతో జగదీష్ మెడికల్ విద్యార్థి విద్యను అభ్యసించేందుకు ఇటీవల ఉక్రెయిన్ కు వెళ్లారు. అక్కడ ఉక్రేన్ కు రష్యాకు యుద్ధం జరుగుతుండటంతో తమ తండాకు చెందిన పిల్లాడు ఎలా ఉంటాడో అని కలత చెందిన గిరిజనులు తల్లిదండ్రులు అతని రాకకోసం వేయి కళ్ళతో ఎదురు చూశారు. ఆయన అక్కడ పడుతున్న ఇబ్బందులను తల్లిదండ్రులకు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడంతో మరింత ఆందోళనకు గురయ్యారు. సోమవారం హైదరాబాదులోని అంతర్జాతీయ విమానాశ్రయంలో అతనికి స్వాగతం పలికి ఆహ్వానించారు. సంతోషం వ్యక్తం చేశారు. ఆహ్వానించిన వారిలో తండాకు చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకులు బిక్షపతి నాయక్, సర్పంచ్ కరెంటుతో జ్యోతి శ్రీను నాయక్, తల్లిదండ్రులు లచ్చి రామ్ నాయక్, సమీప బంధువులు సక్రు నాయక్ సీతారాం నాయక్ తదితరులు ఉన్నారు.