Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
మున్సిపల్ కేంద్రంలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్ర కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ వెన్‌రెడ్డి రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దష్ట్యా ప్రజల దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటుచేసిన లయన్స్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు ఉప్పు అంజనేయులు, దాచేపల్లి ప్రకాశ్, శ్రీనివాస్, నాంపల్లి రమేశ్, మొగుదాల రమేశ్‌గౌడ్, పోలోజు రాజుచారి, శ్రీనివాస్‌చారి, కాసుల వెంకటేశం, ఎమ్‌డి.అత్తార్పాషా, సిలివేరు మంగయ్య, దేప అనిల్, గోపగోని లక్ష్మణ్, వేముల నర్సింహా, కామిశెట్టి భాస్కర్ పాల్గొన్నారు.