Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తుంగతుర్తి
న్యాయవాదులపై జరిగే దాడులను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపర్తి జ్ఞాన సుందర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్ట్ ముందు న్యాయవాదులు న్యాయవాదుల పై జరుగుతున్న దాడులకు నిరసనగా తమ విధులను బహిష్కరించి మాట్లాడారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ ఇటీవల మహబూబ్నగర్ జిల్లాలోని కొల్లాపూర్ లో న్యాయవాది సంతోష్ నాయక్ తో పాటు రంగారెడ్డి జిల్లాలోని న్యాయవాది మహేష్ పై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ కలిగించాలని అన్నారు. ఈ సంఘటనకు బాధ్యులైన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణకోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో న్యాయవాదులు హరిచరణ్. కుమారస్వామి. ప్రతాప్. సతీష్. ఫుల్ సింగ్ నాయక్...