Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -సూర్యాపేట కలెక్టరేట్
నిరుద్యోగులకు వెంటనే ఉద్యోగ నోటిఫిషన్ విడుదల చేయాలని టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఎనిమిది ఏండ్లుగా ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకుండా నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం శోచనీయన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే, ఉద్యోగాలు వస్తాయని ఆశించిన నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లారు అని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం వినతిపత్రాన్ని ఏవో శ్రీదేవికి అందజేశారు.ఈ కార్యక్రామము లో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ, సూర్యాపేట జిల్లా ఇంచార్జ్ నాతలా రాంరెడ్డి,దాసోజు జానకిరాములు, పార్లమెంట్ కమిటీ కార్యదర్శి దారావత్ వెంకన్న,రాష్ట్ర పార్టీ కోశాధికారి ఓరుగంటి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు,రాష్ట్ర యువత నాయకుడు మండవ వెంకటేశ్వర్లు,మట్టపల్లి పార్టీ అధ్యక్షుడు నాగు నాయక్పాల్గొన్నారు.