Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
ట్రాక్టర్ బోల్తా పడి ఓ వ్యక్తి మృతి చెందిన సం ఘటన టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాబునగర్ లో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు మండలం రామాపురం గ్రామనికి చెందిన మీసాల కోటయ్య (52) బాబునగర్ లో ఇటుక బట్టీలు పెట్టి వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ పనిలో భా గంగా ఇటుక బట్టీల మట్టి తోలుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడి కోటయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని కుమారుడు సుధాకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాంబాబు తెలిపారు.