Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మిర్యాలగూడ
మల్ల్లేెపల్లి కేంద్రంలో 14,15 తేదీల్లో జరిగే ఎస్ఎఫ్ఐ నల్గొండ జిల్లా మహాసభల కరపత్రాన్ని సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు కుర్ర సైదా నాయక్, మూడవత్ జగన్ నాయక్ మాట్లా డుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య రంగాన్ని నిర్వీర్యం చేసిం దన్నారు. బడ్జెట్లో విద్యా రంగానికి 30 శాతం నిధులు కేటాయించకుండా విద్యార్థులకు విద్యను దూరం చేసే కార్యక్రమం చేసిందన్నారు. కార్యక్ర మంలో పట్టణ ఉపాధ్యక్షుడు వాదూద్ వీరన్న, అఖిల్, సందీప్, ఉమర్, అజీమ్, జాస్మిన్, ఆయేషా, స్నేహ, తరుణ్, అరుణ్ పాల్గొన్నారు.