Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
పెద్దవుర మండలం కుంకుడు చెట్టు గ్రామం వద్ద కర్నాటి లింగారెడ్డి, శాగం ఈశ్వరమ్మ రైతులు, ఫారెస్ట్ భూములు కబ్జా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సొమ వారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ చంద్రశేఖర్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్య దర్శి నారీ ఐలయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్ రెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ చలకుర్తి రెవిన్యూ శివారులో సమ్మక్క సారక్క దగ్గర కర్నాటి లింగారెడ్డి ఈశ్వరమ్మ గత ప్రభుత్వ హయాంలో గిరిజన రైతులు గిరిజనేతర రైతులను బెదిరించి వారి పొలాలను బలవంతంగా తీసుకున్నారని అన్నారు. గిరిజన రైతులు ఇప్పటికీ కాస్తూ కబ్జాలో ఉన్న ఆ రైతులకు పట్టా పాస్‌బుక్‌లు రానివ్వకుండా ఈశ్వరమ్మ పేరున రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి ఎక్కించుకున్నారని తెలిపారు. కొంత మంది రైతుల దగ్గర అతి తక్కువ ధరలో భూములు కొని, కొన్న దానికంటే ఎక్కువ ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని రైతులకు ఇబ్బం దులకు గురి చేస్తుందని అన్నారు. 100 ఎకరాలు దాకా ఉన్న ఈశ్వరమ్మ కుటుంబానికి లావణి పట్టా ఏ విధంగా వస్తదని ప్రశ్నించారు. అనేక మంది రైతులకు న్యాయం జరగాలంటే రెవెన్యూ శాఖ పూర్తి స్థాయిలో ఆమె భూమిని సర్వే చేసి అన్యాయంగా తీసుకున్నటువంటి రైతుల దగ్గర భూములను వారికి ఇప్పించి గిరిజన రైతులను మోసం చేసినట్టు అయితే వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయా లని అన్నారు. ఈ కార్యక్రమంలో కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోర్ర శంకర్ నాయక్, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అవుట సైదులు, రవి నాయక్, రవీందర్, రైతులు గ్యామా, సుక్కో, రాములు, భోజ, ముని, సేవా, శంకరయ్య, బిక్మంరెడ్డి, రాజు తదిత రులు పాల్గొన్నారు.